Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాసిన్ భత్కల్ పారిపోతాడా?... చర్లపల్లి జైలు చుట్టూ ఆక్టోపస్ బలగాల మోహరింపు!

హైదరాబాదులోని చర్లపల్లి జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో ఆక్టోపస్ బలగాలు మోహరించాయి. ఉగ్రవాదుల నిరోధానికి సంబంధించి సుశిక్షితులైన ఆక్టోపస్ సిబ్బంది చర్లపల్లి జైలు చుట్టూ మోహరించడానికి కారణమేంటంటే, జైల్లో కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా 13 మంది టెర్రరిస్టు ఖైదీలున్నారు. యాసిన్ భత్కల్ జైలు నుంచి తప్పించుకునిపోయే ప్రమాదం ఉందని కేంద్ర నిఘా వర్గాలు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో వేగంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం జైలు వద్దకు ఆక్టోపస్ బలగాలను తరలించింది. అంతేకాక జైలు అధికారులను అప్రమత్తం చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

More Telugu News